పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పీసీసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ తహసీల్దార్‌కు వినతిపత్రిం అందజేశారు. ప్రజలు ఇప్పటికే కరోనాతో ఇబ్బందువులు పడుతుంటే... చమురు ధరలు పెంచి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ సేల్‌టాక్స్, ఎక్సైజ్ డ్యూటీతో ప్రజలపై భారం మోపుతున్నారని చెప్పారు.
ధరల పెంపుతో రవాణారంగంపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై భారం పడుతుందని శ్రీధర్ బాబు అన్నారు. దీంతో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగి... పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు. ఇంధనం ధరలు జీఎస్టీలో చేర్చాలని ఎన్నోసార్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోరినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని కోరారు.
ఇదీ చూడండి: వాగులో ఎద్దులబండి.. వరదలో చిక్కుకున్న రైతు