ETV Bharat / state

జంతువుల కోసం పెట్టిన విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి మృతి - man died due to current shock at ramgiri killa

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగిరి ఖిల్లా సమీపంలో అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్​ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమించగా అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

man died due to current shock at ramgiri killa
జంతువుల కోసం పెట్టిన విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి మృతి
author img

By

Published : May 18, 2020, 5:39 PM IST

పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన వెంకటేష్​.. కొంతమంది స్నేహితులతో కలిసి రామగిరి ఖిల్లా సమీపంలోకి వెళ్లారు. అక్కడ అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వెంకటేష్​ మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమించగా.. పెద్దపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రామగిరి ఎస్సై మహేందర్​ వెల్లడించారు. విద్యుత్​ తీగలు వీరే అమర్చి.. ప్రమాదవశాత్తు విద్యదాఘాతంతో మరణించారా.. లేక ఇతరులు పెట్టిన తీగలు తగిలాయా అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.