ETV Bharat / state

న్యాయవాద దంపతుల హత్య కేసులో అనుమానాలెన్నో...! - vamana rao couple murder case

న్యాయవాద దంపతుల హత్యకేసును సీబీఐతోనే నిష్పక్షపాత విచారణ సాధ్యమని హైకోర్టు న్యాయవాదుల ఐకాస స్పష్టంచేసింది. అన్యాయాలను ఎదిరించేవారిపై దాడులకు తెగబడటం దారుణమని గళమెత్తారు. హత్యకు ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాతోపాటు పోలీసులే కారణమని ఆరోపించారు. లాయర్ల హత్యోందంతంపై వెంటనే స్పందించామని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

lawyer couple murder case updates
lawyer couple murder case updates
author img

By

Published : Feb 21, 2021, 4:46 AM IST

Updated : Feb 21, 2021, 6:24 AM IST

వామన్‌రావు దంపతులకు సకాలంలో వైద్యం అందలేదా? 108 వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స కూడా చేయలేదా? ఈ అనుమానాలనే శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హైకోర్టు న్యాయవాదుల ఐకాస వ్యక్తంచేసింది. ఈ నెల 17న కల్వచర్ల సమీపంలోని నిందితులు వామన్‌రావు దంపతులను రోడ్డుపైనే నరికి, కొన ఊపిరితో ఉండగానే కారులో పారిపోయిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన ప్రాంతాన్ని శనివారం హైకోర్టు న్యాయవాదుల ఐకాస పరిశీలించింది. అనంతరం గుంజపడుగుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పలు సందేహాలు వ్యక్తంచేశారు. ‘మధ్యాహ్నం 2.30కి దాడి జరిగితే 2.45కి 108 వాహనం వచ్చింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి మధ్యాహ్నం 3.20కి చేరుకుంది. ఈ మధ్యకాలంలోనే రక్తస్రావం ఎక్కువగా జరగడంతో బాధితులకు పల్స్‌రేటు పడిపోయినట్టు పోలీసులకు తెలిపామని వారికి చికిత్స అందించిన వైద్యులు చెబుతున్నారు. వారు చికిత్సకు స్పందించలేదని, కొద్దిసేపటికే మృతి చెందారనీ వారు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఐజీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనూ పేర్కొన్నారు. దీన్నిబట్టి 108 సిబ్బంది మార్గమధ్యలో రక్తస్రావాన్ని ఆపే ఎలాంటి ప్రయత్నం చేయలేదనేది స్పష్టమవుతోంది.

15 కి.మీ దూరం..గంట ప్రయాణమా?

హత్య జరిగిన సమయంలో స్థానికులు తీసిన వీడియోలో ‘అంబులెన్స్‌ ఫొటో పంపించాను’ అంటూ ఓ వ్యక్తి మాట్లాడటం విన్పించింది. ‘మీది ఏ ఊరు? ఎవరు చంపారు? ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అంటూ వామన్‌రావును పదేపదే కొందరు ప్రశ్నించడమూ అందులో ఉంది. కుంట శీను, బిట్టు శీను అనుచరులే ఇదంతా చేశారని అనుమానిస్తున్నాం. ఘటనా స్థలానికి, పెద్దపల్లి జిల్లా అసుపత్రికి మధ్య గరిష్ఠంగా 15 కి.మీ దూరం ఉంటుంది. అక్కడికి చేరడానికి గంట సమయం ఎందుకు పట్టింది? వాహనాన్ని మధ్యలో ఎవరైనా ఆపారా? అనే అనుమానమూ ఉంది’ అని వారు పేర్కొన్నారు. నిందితుల అనుచరులే ఘటనా స్థలంలో (సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌)లో సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వీటిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

సీబీఐతోనే నిష్పక్షపాత విచారణ సాధ్యం

అంతకుమునుపు హత్యా స్థలం వద్ద, మంథనిలో న్యాయవాదుల ఐకాస, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు దామోదర్‌రెడ్డి, కొండారెడ్డి, రఘునాథ్‌ స్థలంలో విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తున్న న్యాయవాదులను దారుణంగా హతమార్చడం దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయవాదులకే రక్షణ లేకుంటే మున్ముందు నిందితులకు శిక్ష వేసిన న్యాయమూర్తులకూ ప్రాణభయం ఉంటుందన్న అనుమానం కలుగుతోంది’ అన్నారు. హత్యకు ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాతోపాటు పోలీసులే కారణమని ఆరోపించారు. వామన్‌రావు చనిపోయే ముందు వెల్లడించిన వ్యక్తులు, కుట్రదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. హత్యకు రూ.50 లక్షల సుపారీ ఇచ్చినట్లు ఆడియో రికార్డులు చెబుతున్నా, గ్రామ కక్షలే కారణమని పేర్కొంటూ పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప బాధిత కుటుంబాలకు న్యాయం జరగదన్నారు. హత్యకు గురైన న్యాయవాదులు తెరాస స్థాపించిన నాటి నుంచి తెలంగాణ ఆవిర్భవించే వరకు ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేశారని, వాటిపట్ల కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందన్నారు. నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అనంతరం వారంతా గుంజపడుగులో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. న్యాయాదుల ఐకాస బృందంలో సంపూర్ణదేవి, శిరీష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరిబాబు, కార్యదర్శి రమణకుమార్‌రెడ్డి తదితరులున్నారు.

నేడు చలో గుంజపడుగు: భాజపా

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్యను నిరసిస్తూ భాజపా చలో గుంజపడుగు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ న్యాయ వ్యవహారాల విభాగం నుంచి న్యాయవాదులు హైదరాబాద్‌ నుంచి ఆదివారం(21న) ఉదయం బయల్దేరి వామన్‌రావు సొంతూరు పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో బాధిత కుటుంబాన్ని కలుస్తారని భాజపా ప్రధానకార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి: హత్యతో సంబంధం లేదన్న పుట్ట మధు.. ఎవర్నీ వదలబోమన్న సీపీ

Last Updated : Feb 21, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.