గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు విషయంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చూడండి: తెరాసలో చేరిన భాజపా నేత అంజయ్య