పెద్దపల్లి జిల్లా మంథనిలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా కైట్ ఫెస్టివల్‌ను జడ్పీ ఛైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. పిల్లలకు పతంగులను పంపిణీ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెరాసతోనే సాధ్యమని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు అందిపుచ్చుకుని పండుగ వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. పెద్దపల్లి ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: నిర్భయ దోషి పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో నేడు విచారణ