ఇవీ చూడండి:"దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా: కేసీఆర్"
రంగంలోకి దిగుతా.. మీ సమస్యలు పరిష్కరిస్తా - పెద్దపల్లి
మ్యుటేషన్ల విషయంలో ఎవరూ లంచం ఇవ్వొద్దని... త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను రెవెన్యూ అధికారులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్వయంగా తానే రంగంలో దిగి జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటానని చెప్పారు.
గోదావరిఖని తెరాస సన్నాహక సభలో కేసీఆర్
కోటి ఇరవై లక్షల ఎకరాలకు త్వరలోనే నీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తెరాస ప్రచార సభలో పాల్గొన్నారు. రామగుండంలో మెడికల్ కళాశాల, చెన్నూరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్య, రైతుల పట్టాల సమస్యలను నేరుగా రంగంలోకి దిగి తానే పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు.
ఇవీ చూడండి:"దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా: కేసీఆర్"