రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో వాహనాల పనితీరును అడ్మిన్ అశోక్ కుమార్ పరిశీలించారు. ఇంజిన్ల పనితీరులో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్లకు అవగాహన ఉండాలన్నారు.
ప్రతి నెలా వాహనాల తనిఖీలతో పాటుగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సోదాల్లో ఏఆర్ కమాండెంట్ అడిషనల్ డీసీపీ సంజీవ్‌తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జాతీయ రహదారులకు మహర్దశ... రాష్ట్రం విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్