పెద్దపెల్లి జిల్లాలోని హనుమంతుని పేటలో గతంలో హరితహారంలో నాటిన మొక్కలను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.
ప్రభుత్వ నిధులతో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : 'సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించండి'