ETV Bharat / state

సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్‌కు ఘనస్వాగతం - హైదరాబాద్ తాజా వార్తలు

ఇటీవల బాగా పాపులర్ అయిన సోహెల్ బిగ్ బాస్ షో తర్వాత రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలోని ఆయన ఇంటికి శనివారం వెళ్లారు. ఆ షోలో ప్రజాదారణ పొందిన సోహెల్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సోహెల్‌ను సింగరేణి జీఎం సూర్యనారాయణ అభినందించి... సన్మానించారు.

grand-welcome-to-bigg-boss-winner-sohel-at-ramagiri-in-peddapalli-district
సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్‌కు ఘనస్వాగతం
author img

By

Published : Jan 2, 2021, 7:46 PM IST

grand-welcome-to-bigg-boss-winner-sohel-at-ramagiri-in-peddapalli-district
సెల్పీల కోసం అభిమానుల తాపత్రయం

పెద్దపల్లి జిల్లాకి చెందిన యువకుడు... సింగరేణి ముద్దుబిడ్డ... బిగ్ బాస్ సీజన్-4 ఫేం సోహెల్‌కు సింగరేణి వాసులు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ షో-4 లో పాల్గొని... గెలుపొందాక మొదటి సారిగా సెంటినరీ కాలనీకి శనివారం వెళ్లారు.

సోహెల్‌తో సెల్ఫీలకు ఉత్సాహం

రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, యువకులు నిల్చొని పూలు వెదజల్లుతూ... కేరింతలు, చప్పట్లతో ఘనంగా ఆహ్వానించారు. సోహెల్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి యువకులు పోటీ పడ్డారు. రాజకీయ నాయకులు తదితరులు సోహెల్‌ను సన్మానించారు.

సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్‌కు ఘనస్వాగతం

బిగ్ బాస్ షోలో జరిగిన సంఘటనల గురించి యువకులు అడిగిన ప్రశ్నలకు సోహెల్ వెంటనే సమాధానం ఇస్తూ... యువకులను ఉత్సాహపరిచారు. సెంటినరీ కాలనీలోని సింగరేణి జీఎం కార్యాలయానికి వెళ్లి జీఎం. సూర్యనారాయణ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనదైన ఆటతో జిల్లా ఖ్యాతిని చాటిచెప్పి, అత్యంత ప్రజాదారణ పొందిన మన సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ అంటూ జీఎం సూర్యనారాయణ అభినందించారు. సోహెల్‌ను, అతని తండ్రిని శాలువాతో సత్కరించారు.

సోహెల్‌కు సన్మానం

ఇదీ చదవండి: ఫిబ్రవరిలో నయన్-విఘ్నేశ్ పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.