కాళేశ్వరం ప్రాజెక్టు సుందిళ్ల పంప్‌హౌస్‌లోని ఒకటో మోటార్ వెట్‌రన్ ప్రారంభమైంది. పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ఎల్లంపల్లిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ మోటర్... 2వేల 6వందల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తుంది. ఉదయం హెడ్రెగ్యులేటర్ ఛాంబర్ నుంచి ఫోర్ బే సంపులోకి 128 మీటర్ల నీటిని విడుదల చేసిన అధికారులు... మధ్యాహ్నం నుంచి పంప్‌హౌస్ వెట్‌రన్ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకం సలహాదారులు పెంటారెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గోలివాడ సుందిళ్ల పంప్‌హౌజ్ విజయవంతం కావటంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: పరవళ్లు తొక్కుతున్న నదులు... నిండుకుండల్లా జలాశయాలు