పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఉపరితల గని-1లోని ఫేస్-2లో ప్రమాదం సంభవించింది. ఓబీ బ్లాస్టింగ్ చేసే సమయంలో.. మిస్‌ఫైర్ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ఒప్పంద కార్మికులు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
ఈ దుర్ఘటనలో ప్రవీణ్, రాజేశ్, అర్జయ్య, రాకేశ్ మట్టిలో కూరుకుపోయి.. ఘటనా స్థలిలోనే మృతి చెందగా.. శంకర్, వెంకటేశ్, భీమయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. 4 మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సింగరేణి అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.