ETV Bharat / state

Father Killed His Daughter : పెద్దపల్లి జిల్లాలో దారుణం.. కన్నకూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి.. - Manthani mandal latest news

Father Killed His Daughter : ఓ వ్యక్తి ఉన్మాదిలా మారి కన్నకూతురిని దారుణంగా గొడ్డలితో హతమార్చాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

father killed  daughter
father killed daughter
author img

By

Published : May 11, 2023, 5:17 PM IST

Updated : May 11, 2023, 5:39 PM IST

Father Killed His Daughter : పెద్దపల్లి జిల్లా బట్టుపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కర్కశంగా మారిన కన్నతండ్రే.. కూతురిని గొడ్డలితో నరికి చంపి మరోకరిపై దాడి చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా చేయి దాటి పోయాయి. నిందితుడికి తామే శిక్ష విధిస్తామంటూ గ్రామస్థులంతా ఏకమై అతని వెంటపడ్డారు. దీంతో పోలీసులు వారిని నిలువరించడానికి ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మంథని మండలం బట్టుపల్లికి చెందిన గుండ్ల సదానందం.. తన 11 ఏళ్ల కుమార్తె రజితను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అంతేకాక గ్రామంలోని మరో వ్యక్తిపై దాడి చేశాడు. హత్య గురించి సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్థులంతా .. గ్రామం నుంచి పోలీసు వాహనం కదలకుండా అడ్డుకున్నారు. దారికి అడ్డంగా కర్రలు వేసి పోలీస్ వాహనంలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే పోలీసులు గ్రామస్థులను నిలువరించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదానందంను తమకు అప్పగించాల్సిందేనంటూ వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే కొందరు అతడిపై దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ కోపంతో ఉన్న గ్రామస్థులు కారంపొడి గాల్లోకి విసరారు. దీంతో పోలీసులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. నిందితుడు గతంలో అతని భార్యను చంపిన కేసులో కూడా జైలు జీవితం గడిపి వచ్చాడని వారు ఆరోపిస్తున్నారు.

సైకోలా వ్యవహరిస్తున్న సదానందం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతనికి శిక్షించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రజిత మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

"ఆరు నెలల క్రితం సదానందం తన భార్యను చంపాడు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. సైకోలా వ్యవహరిస్తున్న సదానందం వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది." -గ్రామస్థులు

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. కన్నకూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి..

ఇవీ చదవండి: IPL Betting Gang Arrested : ఐపీఎల్ టైమ్​లో​ జోరుగా బెట్టింగులు..​ మరో 3 ముఠాల అరెస్ట్

Boy died in Accident in Nizambad : కుటుంబం కోసం తండ్రి దుబాయ్ నుంచి వస్తే ప్రమాదంలో కొడుకు మృతి

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణం.. వృద్ధునిపై మూత్రం పోసిన వ్యక్తి!

Last Updated : May 11, 2023, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.