మంథని డివిజన్ పరిధిలోని మూడు సహకార సంఘాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే రైతులు ఓటు వేయడానికి కేంద్రాలకు తరలి వచ్చారు. మహిళా రైతులు సైతం ఉదయమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 17 సహకార సంఘాల్లో, మూడు ఏకగ్రీవం అయ్యాయి. 14 సంఘాల్లోని 157 వార్డులకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు జోన్లుగా విభజించి 270 మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేశామని జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారి చంద్రప్రకాష్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం