పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మద్యం తాగి వాహనం నడిపిన వారి కుటుంబ సభ్యులకు ఏసీపీ ఉమేందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏసీపీ వివరించారు. ఇంటి దగ్గర మన కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకుని వాహనాలు నడపాలన్నారు.
ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. మొదటిసారిగా మద్యం తాగి దొరికిన వారు మరోసారి దొరికితే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని న్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక