ETV Bharat / state

బెల్టు షాపుల వివాదం.. ఎక్సైజ్​ సీఐ బూతు పురాణం

పెద్దపల్లి జిల్లాలోని ఎక్సైజ్ సీఐ గురువయ్య తనను అసభ్యపదజాలంతో దూషించినట్లు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల రమేశ్ తెలిపారు. బెల్టు షాపులపై తాను పెట్టిన స్టేటస్ పట్ల ఆయన దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. వెంటనే ఆ స్టేటస్ తొలగించాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.

excise ci, khammampalli sarpanch
సర్పంచ్​పై సీఐ అసభ్యపదజాలం, ఖమ్మంపల్లి సర్పంచ్
author img

By

Published : Jun 25, 2021, 9:24 AM IST

పెద్దపల్లి జిల్లాలోని ఎక్సైజ్ సీఐ గురువయ్య తనపై దుర్భాషలాడినట్లు ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ సముద్రాల రమేశ్ వాపోయారు. అక్రమ బెల్టుషాపులు ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారని తాను వాట్సాప్​ స్టేటస్ పెట్టుకున్నాని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సీఐ జి. గురువయ్య తనకు ఫోన్ చేసి... అసభ్యపదజాలంతో దూషించినట్లు తెలిపారు. వెంటనే ఆ స్టేటస్ తొలగించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.

సర్పంచ్​పై సీఐ అసభ్యపదజాలం, ఖమ్మంపల్లి సర్పంచ్

సీఐ హోదాలో ఉన్న అధికారి ఇలా దుర్భాషలాడటం ఎంత వరకు సమంజసమని సర్పంచ్ అన్నారు. గ్రామ సర్పంచ్​ని తనతోనే ఇలా అసభ్యంగా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏంటని రమేశ్ ప్రశ్నించారు. ఏ అధికారులను ఉద్దేశించి తాను స్టేటస్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. అకారణంగా తనకు ఫోన్ చేసి బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ సీఐపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ రమేశ్​ పెద్దపెల్లి జిల్లా ఎక్సైజ్ అధికారులకు, మంథని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కోర్టులోనూ అప్పీల్ చేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సర్కారు ఖజానాకు రాబడి... వచ్చి తీరాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.