పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు 21వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నిరాడంబరంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రధాన కూడలిలోని విగ్రహాలకు శ్రీపాదరావు కుమారుడు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
21 ఏళ్లుగా శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలిపారు. వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామన్నారు. శ్రీపాదరావును ఆదర్శంగా తీసుకుని... కార్యకర్తలు ప్రజాసేవ చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు.
కరోనా వ్యాధి వల్ల మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడివారు అక్కడే శ్రీపాదరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.