ETV Bharat / state

ప్రతి పోలీస్ క్రమశిక్షణతో మెలగాలి : ఐజీపీ నాగిరెడ్డి - ప్రతీ పోలీస్ క్రమశిక్షణతో మెలగాలి : ఐజీపీ నాగిరెడ్డి

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్​లో నార్త్ జోన్ ఐజీపీ వై. నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, ఠాణా పరిసరాలను పరిశీలించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అధికారులతో ఉమెన్ సేఫ్టీపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఠాణాకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి : నాగిరెడ్డి
ఠాణాకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి : నాగిరెడ్డి
author img

By

Published : Dec 12, 2019, 6:12 PM IST

పెద్దపల్లి జిల్లాలోని మంథని ఠాణాలో నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి వార్షిక తనిఖీలు చేపట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణను, 5s అమలు చేసిన తీరును సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఠాణా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలగాలన్నారు. పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న అధునాతన టెక్నాలజీ గురించి అధికారులకు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు, అక్రమ దందాలు, అక్రమ రవాణాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు.

రియాక్టివ్ పోలీసింగ్ కంటే... ప్రొయాక్టివ్ పోలీసింగే ఉత్తమం

సంఘటన జరిగిన తర్వాత స్పందించే రియాక్టివ్ పోలీసింగ్ కంటే... ముందే పసిగట్టి నివారించగలిగే ప్రొయాక్టివ్ పోలీసింగ్ ఉత్తమమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, మంథని ఠాణాలో తగినంత సిబ్బంది లేకపోవడం... పని చేయడానికి వచ్చిన సిబ్బంది ఇక్కడ విముఖత చూపుతున్నారని అన్నారు. సరిపడ సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఉమెన్ సేఫ్టీకి భంగం కలిగిస్తే సహించేదే లేదు...

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి అధికారులతో ఉమెన్ సేఫ్టీ పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.

డయల్ 100, హాక్ ఐలపై అవగాహన ఉండాలి...

మహిళలకు డయల్ 100, హాక్ ఐపై అవగహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకొస్తామన్నారు. మహిళలకే కాకుండా పురుషులకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకూ సత్ప్రవర్తనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రామగుండం సీపీ సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ పీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఠాణాకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలి : నాగిరెడ్డి

ఇవీ చూడండి : వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య

Intro:ఈ రోజు నార్త్ జోన్ IG వై. నాగిరెడ్డి ఐపీఎస్ గారు వార్షిక తనిఖీలో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. పోలీస్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బంది చే గౌరవవందనం స్వీకరించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణను, 5s అమలు చేసిన తీరును,వివిధ వర్టికల్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తో వారి యొక్క డ్యూటీ ల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం రికార్డుల ను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది పని తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను స్వయంగా తిరిగి పరిశీలించారు.పోలీస్ స్టేషన్ ను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణ తో ఉండాలని తెలిపారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు, అక్రమ దందాలు, అక్రమ రవాణా లపై నిఘా వేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో పోలీసులు మర్యాదగా మెలగాలన్నారు.

సంఘటన జరిగిన తర్వాత నివారించే రియాక్టివ్ పోలీసింగ్ కంటే.. సంఘటన జరగక ముందే పసిగట్టి నివారించగలిగే ప్రొయాక్టివ్ పోలీసింగ్ ఉత్తమమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు.హరితహారం లో భాగంగా పోలీస్ స్టేషన్ అవరణములో మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..... శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని , మంథని పోలీస్ స్టేషన్ లో తగినంత సిబ్బంది లేకపోవడం మరియు ఇక్కడకి పని చేయడానికి వచ్చిన సిబ్బంది విముఖత చూపడం జరుగుతుంది అన్నారు. సాధ్యమైనంత త్వరగా సరిపడా సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వాలని అదికారులను ఆదేశించడం జరిగింది అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయని, నిన్న సాయంత్రం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి అధికారుల తో *ఉమెన్ సేఫ్టీ పై* తీసుకోవలసిన చర్యలపై సమావేశం తీసుకోవడం జరిగింది అన్నారు. మహిళలు, యువతులపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడిన సహించేది లేదని చట్ట ప్రకారం కఠినం గా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడాన్ని ఎట్టి పరిస్థితి లలో సహించేది లేదని, తక్షణమే కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చూడడం జరుగుతుంది అన్నారు. మహిళలకు డయల్ 100, హాక్ ఐ లపై అవగహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యo తీసుకురావాలి అన్నారు. మహిళలకే కాకుండా పురుషులకు, స్కూల్ , కాలేజీ విద్యార్థుల కు కూడా సత్ప్రవర్తన పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. పాత నేరస్థులను కౌన్సిలింగ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలి అన్నారు.

ఐజిపి గారితో కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సత్యనారాయణ, పెద్దపల్లి డిసిపి పి. రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఉన్నారు.Body:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.