ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భర్తను హత్య చేసింది ఓ భార్య. టి.సత్యశర్మ (55) ను భార్య హేమ నాగమణి గొంతు నులిమి చంపింది. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హేమ నాగమణి కాళ్ళకూరులో నర్సుగా పనిచేస్తుంది. భర్త సత్య శర్మ ఇంటిదగ్గర ఖాళీగా ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో వేధిస్తుంటాడని... ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని స్థానికులు చెబుతున్నారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది నాగమణి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: అప్పుడు..ఇప్పుడు.. ఎప్పటికీ 'సూపర్‌స్టార్' ఒక్కడే