ETV Bharat / state

పునరావాసంలో జాప్యం.. లబ్ధిదారుల ఆందోళన - peddapalli singareni

సింగరేణి ఉపరితల గని విస్తరణలో గృహాలు కోల్పోయిన నిర్వాసితులు పునరావాసం, ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని ఆందోళన నిర్వహించారు. సుమారు 120 మంది గురువారం క్వారీ వద్ద బైఠాయించి పనులను అడ్డుకున్నారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్​లో చోటుచేసుకుంది.

పునరావాసంలో జాప్యం.. లబ్ధిదారుల ఆందోళన
author img

By

Published : Nov 8, 2019, 10:23 AM IST

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్​ సింగరేణి విస్తరణలో తమ ఉనికి కోల్పోతూ గత ఆరు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సింగరేణి ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-2లో లద్నాపూర్‌ గ్రామస్తులు సుమారు 120 మంది గురువారం ఆందోళన చేసి క్వారీ పనులను అడ్డుకున్నారు.

గ్రామస్తులందరూ కలిసి ఓసీపీ-2 వద్ద ధర్నా నిర్వహించి, సింగరేణికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి, పునరావాసం కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం క్వారీలోకి దిగేందుకు ప్రయత్నించగా, సింగరేణి అధికారులు కవ్వింపు చర్యలతో గ్రామస్థులు ఉన్న ప్రదేశంలోనే బ్లాస్టింగ్‌ చేపట్టారు. దీంతో ఇరువర్గాల వారు వాగ్వాదానికి దిగారు. గ్రామ సమీపంలో క్వారీలో బ్లాస్టింగ్​ల వల్ల గృహాలు ధ్వంసమవుతున్నాయన్నారు. తమ గ్రామానికి చెందిన యువకులు సింగరేణిలో అంతర్భాగమైన ఎన్సీసీ కంపెనీలో పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించారన్నారు.

ఇప్పటివరకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, నష్టపరిహారం ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తమ జీవితాలతో ఆడుకుంటుందని గ్రామస్థులు వాపోయారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ సిబ్బందితో చేరుకుని సింగరేణి రెవెన్యూ అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వినకుండా గ్రామస్థులు ఆందోళన కొనసాగించారు. ఆందోళన కొనసాగిస్తున్న గ్రామస్థులను పోలీసులు వాహనాలలో ఎక్కించి తీసుకెళ్లారు.

పునరావాసంలో జాప్యం.. లబ్ధిదారుల ఆందోళన

ఇదీ చూడండి : ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

Intro:ఓ సి పి 2 వద్ద ఆందోళన.

పునరావాసం లో జాప్యం చేస్తున్నారని లబ్ధిదారుల ఆందోళనలు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామ సమీపంలోని సింగరేణి ఉపరితల గని విస్తరణలో గృహాలను కోల్పోయిన నిర్వాసితులు పునరావాసం మరియు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని, తమ గ్రామంనకు చెందిన యువకులు సింగరేణి లోని అంతర్భాగమైన ఎన్సిసి కంపెనీ లో పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సింగరేణి ఉపరితల గని వద్ద ఆందోళన నిర్వహించారు.
సింగరేణి ఆర్.జి త్రీ ఉపరితల గని విస్తరణలో భాగంగా లద్నా పూర్ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు ఈ ఆందోళన నిర్వహించారు.

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామం సింగరేణి విస్తరణలో భాగంగా ఉనికి కోల్పోతూ గత ఆరు సంవత్సరాల నుండి సింగరేణి అధికారులు గ్రామాన్ని స్వాధీనం చేసుకొని గ్రామం చుట్టు సింగరేణి కి సంబంధించిన ఒబి మట్టి కుప్పలను గ్రామం చుట్టూ పోస్తూ ,ఆ గ్రామానికి చెందిన భూనిర్వాసితులకు మాత్రం రావలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మరియు పునరావాసం కల్పించడం లేదని, ఇప్పటికీ అనేకసార్లు సింగరేణి పనులను అడ్డుకున్నారు.
గత కొద్దికాలంగా సింగరేణి సంస్థ నిర్మిస్తున్న యల్ 6 కాలువ పనులను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు.
కొన్ని రోజుల క్రితం లద్నా పూర్ గ్రామానికి చెందిన సుమారు 120 మంది యువకులు సింగరేణి లోని అంతర్భాగమైన ఎన్సిసి కంపెనీలో తాత్కాలికం గా ఉద్యోగం చేస్తున్న యువకులను అకారణంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు లద్నాపూర్ గ్రామస్తులు అందరూ కలిసి OCP2 లో ధర్నా నిర్వహించి, సింగరేణికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని పునరావాసం కల్పించాలని తొలగించిన వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. గ్రామానికి అతి సమీపంలో క్వారీ లో బ్లాస్టింగ్ లను చేస్తుండడంతో గృహాలు ధ్వంసం అవుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, గాయాలపాలు అవుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తూ మా డిమాండ్లు అంగీకరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి గోదావరిఖని ఏసిపి ఉమేందర్ సిబ్బందితో చేరుకొని సింగరేణి రెవెన్యూ అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వినకుండా , గ్రామస్తులు ఆందోళన కొనసాగించారు. ఆందోళన కొనసాగిస్తున్న గ్రామస్తులను బలవంతంగా వాహనాలలో ఎక్కించి వారిని పైకి తీసుకు వచ్చారు. గ్రామస్తులు సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సింగరేణి పనులను అడ్డుకుంటూనే ఉంటామని ఎంత దూరమైనా పోతామని న్నారు.

బైట్స్.
1. రవీందర్ రెడ్డి గ్రామస్తుడు.
2. రవి గ్రామస్తుడు.
3. విజయ గ్రామ సర్పంచ్

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.