ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితాల నిర్ధరణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల అనేక మంది విద్యార్థులు నష్టపోయినట్లు వెల్లడించారు. వెంటనే ఇంటర్మీడియట్ ఫలితాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ వివాదం: కాంగ్రెస్ నేత పొన్నాల అరెస్ట్