రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా.. పెద్దపల్లి జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ మంథని డివిజన్లో పర్యటించారు. గాజులపల్లె గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించి, నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గాజులపల్లి పరిసరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా మంథని మున్సిపాలిటీ గంగాపురిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
వ్యాధుల వ్యాప్తి నిర్మూలనకు చర్యలు
అనంతరం గాజులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని వార్డ్ మెంబర్లకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్