పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరదకాల్వకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వరద కాల్వకు నీరందించేందుకు అవసరమైన నీటినిల్వ ఎస్సారెస్పీలో లేనందున.. ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ్యుల విజ్ఞప్తిపై స్పందించిన కేసీఆర్.. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరదకాల్వకు నీరివ్వాలని సూచించారు.
ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, లక్ష్మీపూర్, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా వరద కాల్వలోకి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. తద్వారా బాల్కొండ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రబీ పంటకు సాగునీరు ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చూడండి: 'రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయి'