దేశవ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు పవిత్ర గోదావరి నదీ జలాలతో భాజపా ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు... పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహలకు గోదావరి నదీ జలాలతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా 25లక్షల అంబేడ్కర్ విగ్రహాలను పవిత్ర నది జలాలతో శుద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు ఈ-పంచాయత్ పురస్కారం