పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఛత్రపతి యువసేన యువకులు గత రెండేళ్లుగా మట్టితో తయారు చేసిన భారీ విగ్రహాలను పూజిస్తున్నారు. గతేడాది 36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఆరాధించగా.. ఈ సంవత్సరం 39 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా మట్టి, సున్నం, సన్న ఇసుక, చెక్క పొట్టు, దారం లాంటి పదార్థాలను ఉపయోగిస్తూ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. నీటి ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తామని యువకులు చెప్పారు.
ఆదర్శంగా నిలుస్తున్న 39 అడుగుల మట్టి గణపతి - big eco friendly ganesh at peddapalli
పర్యావరణ పరిరక్షణకు ఆ యువకులంతా కంకణబద్ధులై మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 అడుగుల మట్టి విగ్రహాన్ని పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఛత్రపతి యువసేన యువకులు గత రెండేళ్లుగా మట్టితో తయారు చేసిన భారీ విగ్రహాలను పూజిస్తున్నారు. గతేడాది 36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఆరాధించగా.. ఈ సంవత్సరం 39 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా మట్టి, సున్నం, సన్న ఇసుక, చెక్క పొట్టు, దారం లాంటి పదార్థాలను ఉపయోగిస్తూ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. నీటి ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తామని యువకులు చెప్పారు.
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: పర్యావరణ పరిరక్షణలో ఆ.. యువకులంతా కంకణబద్ధులై మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కంకణబద్ధులుగా మారారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మట్టితో 39 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించి ఈ వినాయక చవితి వేడుకల్లో విగ్రహాన్ని ప్రతిష్టించారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన చత్రపతి యువసేన యువకులు గత రెండేళ్లుగా మట్టితో తయారు చేసిన భారీ విగ్రహాలను ప్రతిష్టిస్తారు గత ఏడాది 36 ఆడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించ గా ఈ ఏడాది తమ మండపంలో కొలువుదీరిన 39 అడుగుల విగ్రహం అందర్నీ కనువిందు చేస్తోంది విగ్రహం తయారీలో పర్యావరణానికి ఏ మాత్రం తగలకుండా సహజ సిద్ధంగా లభించే మట్టి, సున్నం, సన్న ఇసుక, చెక్క పొట్టు దారం వంటి వాటిని వినియోగించారు. విగ్రహ తయారీకి కలకత్తా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలనుంచి కళాకారులను తీసుకువచ్చి గత రెండు నెలల వ్యవధిలోనే ఈ విగ్రహాన్ని పూర్తి చేశాను. ప్రస్తుతం పెద్దపల్లి లోని సురభి కాలనీ లో కొలువుదీరిన ఈ భారీ మట్టి విగ్రహం ప్రజలను కనువిందు చేస్తోంది. ఉదయం సాయంత్రం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తమ మండపానికి వచ్చి స్వామి వారిని తిలకిస్తున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇంతటి భారీ విగ్రహాన్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్లి నిమజ్జనం చేసే వీలు లేకపోవడంతో స్థానికంగానే మంచి నీటి ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తామని తెలిపారు.
బైట్: శివం గారి సతీష్, చత్రపతి యువసేన అధ్యక్షుడు
Body:లక్ష్మణ్
Conclusion:పెద్దపల్లి