పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం కార్పొరేషన్ ఏరియా భాజపా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ హాజరయ్యారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితో 50 డివిజన్లలో భాజపా కార్పొరేటర్లను గెలిపించాలన్నారు. రామగుండం ప్రాంతంలో సీనియర్ నాయకులు మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపెల్లి మాజీ ఎంపీ వివేక్ లాంటి సీనియర్ నేతలు చేరడం భాజపాలో సంతోషకరమన్నారు.
రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మొదటి మున్సిపల్ మేయర్గా భాజపా జెండా ఎగురవేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కూడా భాజపా జాతీయ నాయకత్వం దృష్టి సారించి, రానున్న ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు కృషి చేస్తుందన్నారు.
గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో చేస్తున్న నిరసన దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. కార్మికులకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడకుండా ముందుకు సాగాలని కార్మికులకు ఆయన భరోసా కల్పించారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'