భాజపా యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేదలను సీఎం ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సి ఉండగా కేసీఆర్ మాత్రం తన కుటుంబ సభ్యులను పాఠ్యాంశాల్లో చేర్చే ఆలోచనలో ఉన్నారని అన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తానని మర్చిపోయారని చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మర్చిపోయారని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం