ETV Bharat / state

'చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది' - municipal election

మున్సిపాలిటీ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా మంథనిలో చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లు వెల్లడించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అధికారులు సీజ్ చేశారు. పోలీసు బందోబస్తుల నడుమ వాటిని స్ట్రాంగ్ రూమ్​కు తరలించారు.

ballot boxes are seized and moved to peddapalli
'చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది'
author img

By

Published : Jan 22, 2020, 7:38 PM IST

..

'చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది'

ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు

..

'చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది'

ఇవీ చూడండి: కాలితో ఓటేశాడు... ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు

Intro:ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికలు.

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రశాంతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి కోసం పోలింగ్ కేంద్రాల వద్ద కు చేరుకొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మంధని లో ఉదయం మూడో వార్డు పోలింగ్ బూత్ లో జరిగిన సంఘటన మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది.

మంథనిలో 13 వార్డులకు గాను 12,763 మంది ఓటర్లు ఉన్నారు. మంథనిలో పోలింగ్ అయిన ఓట్ల శాతం 79.83% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తం నమోదైన ఓట్లు10,189,
పురుషులు 5004 మంది,
మహిళలు 5 185మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా మంధనిలో ఎన్నికలు ముగిశాయి.


Body:యం.శివప్రసాద్, మంధని.


Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.