పెద్దపెల్లి జిల్లా రామగుండంలో చిరుత పులి చర్మాన్ని అమ్మడానికి వచ్చిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఆహేరి తాలూకా మరుపల్లికి చెందిన కొండ తిరుపతి, గంగారం, తులసీరాములు మేకల మంద చుట్టూ విద్యుత్ తీగలు అమర్చారు. అక్కడికి వచ్చిన చిరుత విద్యుత్ షాక్తో చనిపోయింది. వారు చిరుత చర్మాన్ని అమ్మడానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కోటపల్లికి వచ్చారు.
ముందస్తు సమాచారంతో రామగుండం పోలీసులు వారిని పట్టుకున్నారు. చేతిలో ఉన్న సంచి పరిశీలించగా చిరుత పులి చర్మం లభ్యమైనట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణుల మృతికి కారణమైన 350 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస