ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ధర్మపురి ప్రజల రుణం తీర్చుకుంటానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మొదటిసారిగా మంత్రి హోదాలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు. జయదుర్గాదేవి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో కొప్పులకు స్వాగతం పలికారు. ఏ పని మొదలుపెట్టినా దుర్గాదేవి ఆశీస్సులు తీసుకుంటానని మంత్రి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోరామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్,తెరాస నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు గజమాలతో కొప్పులను సన్మానించారు.
అమ్మవారి దయవల్లే.. - eshwar
ఏ పని మొదలుపెట్టినా.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జయదుర్గాదేవి ఆశీస్సులు తీసుకుంటాని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్కు రుణపడి ఉంటానని తెలిపారు.