ETV Bharat / state

అకాల వర్షంతో... తడిసిముద్దైన ధాన్యం... - undefined

అకాల వర్షాలు రైతన్నను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈరోజు తెల్లవారు జామున కురిసిన భారీ వాన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండల​ కర్షకులకు కన్నీరు మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డ్​లో ధాన్యం తడిసిముద్దైంది.

అకాల వర్షంతో... తడిసిముద్దైన ధాన్యం...
author img

By

Published : Apr 22, 2019, 2:39 PM IST

రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మధనపడుతుంటే... ఇప్పుడు అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో ధాన్యం తడిచిపోయింది. దాదాపు 5000 క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం నీట మునిగింది.

15రోజుల క్రితమే మార్కెట్​కు వచ్చిన ధాన్యం...

సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 15 రోజుల క్రితం రైతులు అమ్మకానికి ధాన్యం తీసుకొచ్చారు. అధికారులు హమాలీల కొరత ఉందంటూ నేటికి కొనుగోలు చేయలేదు. కుండపోత వర్షం కురవడం వల్ల మార్కెట్ యార్డులోని వరి ధాన్యం నీటికి కొట్టుకుపోయింది. వర్షం నిలిచిపోగానే అన్నదాతలు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. నీటిని ఎత్తిపోయడం, ధాన్యాన్ని ఆరబెట్టె పనిలో నిమగ్నమయ్యారు.

గత వారం రోజుల వ్యవధిలో ఇప్పటివరకు మూడు సార్లు వర్షం కురిసింది. వడ్లు తడవకుండా ఉండేందుకు కనీసం టార్పాలిన్ కవర్లు కూడా అధికారులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5000 క్వింటాళ్లకు పైగా ధాన్యం తడిసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అకాల వర్షంతో... తడిసిముద్దైన ధాన్యం...

ఇవీ చూడండి:ఇంటర్​ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Intro:యాసంగి పంట వ్యవసాయ మార్కెట్ కు తరలించిన రైతులు ధాన్యం విక్రయించడానికి నానా తంటాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో గత పది రోజులుగా ఇప్పటివరకు 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు లాంఛనంగా ప్రారంభించారు. కానీ తేమ శాతం ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. ఇంకోవైపు హమాలీలు చార్జీలు పెంచాలని తూకం మొదలు పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు గత మూడు రోజులుగా ప్రతి రోజు మోస్తారు వర్షం పడటంతో విక్రయ కేంద్రాల్లో రైతులకు ధాన్యం తడిసి ముద్దవుతుంది. దీనితో తేమ తగ్గదు తూకం జరగదు అనే చందంగా సాగుతోందని రైతులు వాపోతున్నారు. గంగాధర, రామడుగు, చొప్పదండి , బోయినపల్లి , కొడిమ్యాల మండలాల్లో తూకం కోసం ధాన్యం నిల్వ చేసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు. ఉన్నతాధికారులు దాన్యం ప్రతి గింజను కొంటామని భరోసా ఇస్తున్న క్షేత్రస్థాయిలో కొనుగోలు మొదలుపెట్టక రైతులు ఆందోళన చెందుతున్నారు.

బైట్ 1
కొట్టే శ్రీనివాస్, లక్ష్మీదేవి పల్లె రైతు

బైట్ 2
మోహన్ ,పోతుగంటిపల్లి రైతు

బైట్ 3
చిందం కమలాకర్, పిట్టలపల్లి రైతు

బైట్ 4
కటకం సాయికుమార్ , పందికుంటపల్లి రైతు

Body:సయ్యద్ రహ్మత్ , చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.