పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన అన్నారం పంప్ హౌస్ 8 వ మోటర్‌ను అధికారులు పరీక్షించారు. సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని ఎత్తి పోసి వెట్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. లింకు 1లో రెండు టీఎంసీలకు సరిపడా మోటర్లను అన్నారం పంప్ హౌస్ నుంచి విజయవంతంగా పరీక్షించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అన్నారం పంప్ హౌస్‌లోనే మొదటిసారిగా రెండు టీఎంసీలకు సరిపడా మోటర్లు నడుస్తుండటం విశేషం.
ఇవీ చూడండి : ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్