ETV Bharat / state

మేడారానికి ఉమ్మడి కరీంనగర్​ నుంచి 600 బస్సులు - peddapalli district today news

పెద్దపల్లి జిల్లా మంథని నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే బస్సులను మంథని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 600 బస్సులను ఈ జాతర కోసం ఏర్పాటు చేశామన్నారు. 6 కేంద్రాల నుంచి ఆ బస్సులు మేడారంకు వెళ్లనునున్నాయని తెలిపారు.

125 buses from peddapalli to Medaram jatara special price 310
మేడారానికి ఉమ్మడి కరీంనగర్​ నుంచి 600 బస్సులు
author img

By

Published : Feb 3, 2020, 7:53 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే బస్సులను మంథని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ప్రారంభించారు. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు రాష్ట్రంలో అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం 4 వేల బస్సులను టీఎస్​ఆర్​టీసీ ఏర్పాటు చేసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 600 బస్సులను ఈ జాతర కోసం వినియోగించనున్నట్టు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. 6 కేంద్రాల నుంచి మేడారంకు వెళ్లనునున్నాయన్నారు. ఈ ప్రత్యేక బస్సులు ఈనెల 9వ వరకు నిర్విరామంగా పనిచేస్తాయని అన్నారు.

  • కరీంనగర్ నుంచి 115 బస్సులు
  • హుజురాబాద్ నుంచి 45 బస్సులు
  • గోదావరిఖని నుంచి 140 బస్సులు
  • మంథని నుంచి 140 బస్సులు
  • 8వ కాలనీ నుంచి 35 బస్సులు
  • పెద్దపల్లి కేంద్రం నుంచి 125 బస్సులు
  • కరీంనగర్ నుంచి మేడారంకు పెద్దలకు రూ. 310, పిల్లలకు రూ. 160 ధర నిర్ణయించారు.
  • మంథని నుంచి పెద్దలకు రూ. 260, పిల్లలకు రూ. 140 గా బస్​చార్జీలు నిర్ణయించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆరు పాయింట్లలో భక్తుల సౌకర్యార్థం విద్యుత్, మంచినీరు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంథని డీఎం రవీంద్రనాథ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : మహాజాతరకు ముందే జనజాతర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.