ETV Bharat / state

లక్ష్యమే ఊపిరిగా చదివింది.. అందుకే డాక్టరేట్‌ వరించింది.! - ideal woman jyothi from gadkol village

నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి నడిపే మెకానిక్ షాపే ఆ కుటుంబానికి ఆధారం.. ఏడో తరగతిలో ఉండగానే వివాహం చేశారు. చదువుంటే ప్రాణంగా భావించేది. పిల్లలు, కుటుంబ స్థితి తీరిన తర్వాత 12ఏళ్ల విరామం అనంతరం మళ్లీ చదువు బాట పట్టింది. అహర్నిశలు శ్రమించి ఉన్నత చదువులు అభ్యసించింది. కష్టాలు ఎదురైనా అధిగమించి అనుకున్నది సాధించింది. తెలుగు పండిట్‌గా ప్రభుత్వం ఉద్యోగం సాధించింది. అయినా ఆగిపోకుండా పీజీ చేసి.. పీహెచ్ డీ సాధించి స్ఫూర్తిగా నిలుస్తోంది. పుస్తకం పట్టుకుంటే తల్లి ఒడిలో సేద దీరిన భావన ఆమెది. చిన్న చిన్న కష్టాలకే లక్ష్యాలను పక్కన పెట్టేసి సాధించలేకపోతున్నామని నిరాశ చెందే యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్గోట్‌కు చెందిన ఉపాధ్యాయురాలు అన్నందాసు జ్యోతిపై మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ideal woman, jyothi
జ్యోతి, ఆదర్శ మహిళ
author img

By

Published : Mar 8, 2021, 11:09 AM IST

Updated : Mar 8, 2021, 2:18 PM IST

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన అన్నందాసు గంగాధర్, గంగామణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొదటి సంతానంగా జ్యోతి జన్మించింది. తండ్రి గంగాధర్ పదో తరగతి వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో మెకానిక్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉండేది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. గ్రామంలో ఏడో తరగతి వరకే ఉండటంతో జ్యోతి అంత వరకే చదువుకుంది. పై చదువులకు మండల కేంద్రం సిరికొండకు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉండటంతో జ్యోతి చదువు మాన్పించారు. దీంతో జ్యోతి రెండు నెలల్లో కుట్టు మిషిన్ నేర్చుకుంది. బట్టలు కుడుతూ తండ్రి సంపాదనకు అండగా నిలిచింది. తోటి విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసే సమయంలోనే టైలరింగ్ చేసి సంపాదించిన రూ.15వేల తోనే 15ఏళ్ల వయసులో జ్యోతికి పెళ్లి చేశారు.

లక్ష్యమే ఊపిరిగా చదివింది.. అందుకే డాక్టరేట్‌ వరించింది.!

ఏకసంతాగ్రహి...

పెళ్లయి అత్తగారింటికి వెళ్లినా జ్యోతి ఆలోచన చదువు చుట్టూనే తిరిగేది. దినపత్రిక, పుస్తకాలు.. ఇలా ఏది కనిపించినా అనర్గళంగా చదివి గుర్తుంచుకునేది. కుటుంబ బాధ్యతలు, పిల్లలు పుట్టడంతో చదువు పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఈ సమయంలో తాను నేర్చుకున్న టైలరింగ్ వృత్తి చేస్తూ భర్తకు ఆర్థికంగా అండగా నిలిచింది. తనతోపాటు మరో నలుగురు మహిళలకు అప్పట్లోనే ఉపాధి కల్పించింది. 18 ఏళ్ల వయసులోనే బాబు సంతోష్ కుమార్, 21ఏళ్ల వయసులో పాప జాహ్నవి జన్మించింది. పిల్లలు పెద్దయిన తర్వాత మళ్లీ చదువుపై ఆలోచన మొదలైంది. బట్టలు కుడుతూ రేడియో వినే జ్యోతికి చదువు గురించి, మహిళల చైతన్యం గురించి చెప్పే మాటలు ఆకర్షించేవి. దీంతో పాప ఆరేళ్ల వయసున్నప్పుడు చదువుకుంటానని భర్తకు చెప్పింది. అతను అంగీకరించడంతో బట్టలు కుడుతూ, ఇంటి, వంట పని చేస్తూ పిల్లలను చూసుకుంటూనే దూరవిద్య విధానంలో డిగ్రీలో చేరింది. 12ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకం తన చేతికి రావడంతో అమ్మ ఒడిలో ఉన్నట్లే భావించింది. ప్రతి రోజూ అన్ని పనులు పూర్తి చేసి రాత్రి పడుకునే ముందు రెండు గంటలు చదువుకునేది. తెల్లారి పనులు చేసుకుంటూ రాత్రి చదివిన అంశాలను మననం చేసుకునేది. ఇలా డిగ్రీ పూర్తి చేసింది జ్యోతి.

అనుకున్నది సాధించి..

తను మళ్లీ చదువుకోవడానికి మరో బలమైన కారణం ఉంది. తన కంటే చిన్నవాళ్లైన చెల్లెళ్లు, తమ్ముడు ఉన్నత చదువు చదివి వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు బంధువులెవరికైనా చెప్పేటప్పుడు వారి గురించి గొప్పగా చెప్పేవారు. తన గురించి చెప్పకపోవడం, తాను ఏడో తరగతితో చదువు ఆపేయడం ఆమెను బాధించేది. దీంతో మళ్లీ చదవడం ఆరంభించి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ కోర్సులో చేరింది. ఏడాది పాటు నిజామాబాద్‌లోనే గది అద్దెకు తీసుకుని పిల్లలతోపాటు ఉండి చదువుకునేది. పిల్లలను పాఠశాలకు పంపించి తాను కళాశాలకు వెళ్లేది. అలా బీఈడీ పూర్తి చేసిన జ్యోతి.. 2008 డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తెలిసిన వాళ్ల సలహాతో కోచింగ్ కోసం పిల్లలను ఇంటిదగ్గరే వదిలి హైదరాబాద్ వెళ్లింది. రెండు నెలలపాటు కోచింగ్ తీసుకుని మరో మూడు నెలలు ఇంటి దగ్గర కఠోరంగా శ్రమించింది. చివరకు 2009లో తెలుగు పండిట్ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి అనుకున్నది సాధించింది.

వివేకానందుడి స్ఫూర్తి వ్యాక్యాలతో..

ప్రభుత్వ ఉద్యోగం సాధించినా చదవాలన్నా కాంక్ష తీరలేదు. దీంతో మళ్లీ దూరవిద్యలో పీజీ కోర్సు పూర్తి చేసింది. అనంతరం తెలిసిన వారి సలహాతో పీహెచ్‌డీ కోసం సన్నద్ధమైంది. సెట్, నెట్‌లో అర్హత సాధించి 2014లో తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోర్సులో చేరింది. బీఎస్ రాములు కథలు- తెలంగాణ జన జీవన చిత్రణ అనే అంశంపై 2019లో థీసిస్ సమర్పించింది. 2020లో విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ఏడో తరగతిలోనే చదువు ఆపేసి పెళ్లి చేసుకుని 12ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చదువు బాట పట్టి పీహెచ్‌డీ సాధించడంతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. స్థానికంగా ఉండే మహిళలు జ్యోతి నుంచి ప్రేరణ పొందారు. జ్యోతి పిల్లలు సైతం స్ఫూర్తి పొంది ఉన్నత చదువులు అభ్యసించారు. కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి హైదరాబాద్ జీఎస్టీ భవన్‌లో పని చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ తర్వాత కూచిపూడిలో ఎంఏ పూర్తి చేసింది. 'సమస్త శక్తులు నీలోనే ఉన్నాయి. వాటిని వెలికి తీసే బాధ్యత నీదే... ప్రాణం కోసం ఎలా శ్వాస తీసుకుంటామో.. లక్ష్యం కోసం ధ్యాస ఉంచాలి.' అన్న వివేకానందుడి మాటలే స్ఫూర్తిగా లక్ష్యం సాధించగలిగానని జ్యోతి తెలిపింది.

పురస్కారాలు, సన్మానాలు

పీహెచ్‌డీ సమయంలో ఆమె రాసిన అనేక వ్యాసాలు, కథలు వివిధ దిన, మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అనేక సెమినార్లు, కవి సమ్మేళనాల్లో ప్రశంసా పత్రాలు వచ్చాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ తెలుగు సాహిత్యంపై చర్చల్లో పాల్గొన్నారు. వివేకానంద పురస్కారం సాధించారు. ఇందూరుభారతి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా జ్యోతిని సన్మానించి సన్మానపత్రం అందించారు. 2019లో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. భార్యలో ఉన్న ఆసక్తిని గమనించి ఆమెను ప్రోత్సహించానని భర్త శివకుమార్ తెలిపారు. అనేక కష్టాలు అనుభవించామని.. అయినా వెనుకడుగు వేయకుండా ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థితికి చేరడం గొప్పగా అనిపిస్తోందని తెలిపారు.

చిన్న చిన్న అడ్డంకుల వస్తేనే తట్టుకోలేక నేటి యువత లక్ష్యాన్ని పక్కన పెట్టి నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ చదువే ప్రాణంగా భావించి పుష్కర కాలం తర్వాత మళ్లీ పుస్తకం చేతబట్టిన జ్యోతి.. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కాకుండా డాక్టరేట్ పూర్తి చేయడం అనేక మందిలో స్ఫూర్తి నింపుతోంది. జ్యోతిని ఆదర్శంగా తీసుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా అలవోకగా అధిగమించి విజయాన్ని సాధించవచ్చు.

ఇదీ చదవండి: విమెన్స్ డే స్పెషల్: నీ సహనానికి సరిహద్దులు కలవా..!

Last Updated : Mar 8, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.