ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా జిల్లా వ్యాప్తంగా మందు దుకాణాలు మూసేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
7వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు చేయరాదని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను మభ్య పెట్టేందుకు ఎక్కడైనా మందు బాటిళ్లు, తదితరాలు దొరికితే జప్తు చేయాలని పేర్కొన్నారు.
9 వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసిన తరవాతనే మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పప్పు.. బెల్లం.. కబ్జాలకు లేదు కళ్లెం..