ETV Bharat / state

కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య - murder news

కుటుంబ కలహాలతో విసుగుచెందిన భార్య... కొడుకులతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్యచేసిన ఘటన నిజామాబాద్​ జిల్లా నందిపేటలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాగుడు బానిసై... తరచూ గొడవపడే భర్తతో వేగలేక హత్య చేసి ఉంటారని స్థానికులు తెలిపారు.

wife murdered husband with sons in nizamabad
కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : May 31, 2020, 11:58 AM IST

నిజామాబాద్​ జిల్లా నందిపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య,కొడుకులు కలిసి కుటుంబ పెద్దనే పొట్టనబెట్టుకున్నారు. పట్టణంలోని దుబ్బ ప్రాంతంలో నివాసముండే... గంధం రమేశ్ (41) అనే వ్యక్తిని భార్య, ఇద్దరు కొడుకులు తాడుతో ఉరేసి హత్య చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కి వెళ్లి లొంగిపోయారు.

గత కొన్ని నెలలుగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తటం వల్ల రమేశ్​... తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. విసుగెత్తిన కుటుంబ సభ్యులు పథకం ప్రకారం తాడుతో మెడకు ఉరేసి హత్య చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబీకులు విసుగు చెంది హత్య చేసి ఉంటాని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనాను తరిమికొట్టి.. ఆదర్శంగా నిలిచిన పట్టణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.