ఇవీ చూడండి : కేటీఆర్ ఆకస్మిక తనిఖీ... అనుకోకుండా ఓ సెల్ఫీ
కొట్టుకుపోయిన వంతెన.. రాకపోకలకు ఇబ్బందులు - ప్రభుత్వం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వద్ద నిర్మించిన వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
కొట్టుకుపోయిన వంతెన
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరులో నిర్మించిన తాత్కాలిక వంతెన రెండు రోజులుగా కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. మండలంలోని రామడుగు, హుస్సేన్ నగర్, గడుకోలు, కొండాపూర్, తూముపల్లి, న్యావనంది, రావుట్ల, మైలారం, చీమనపల్లి, పంది మడుగు, తాటిపల్లి, పాకాల, తదితర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తరచూ తాత్కాలిక వంతెనలు కోతకు గురవుతూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. తమకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి : కేటీఆర్ ఆకస్మిక తనిఖీ... అనుకోకుండా ఓ సెల్ఫీ
sample description