ETV Bharat / state

Telangana University Controversy : టీయూలో ముగిసిన విజిలెన్స్‌ తనిఖీలు.. హార్డ్ డిస్క్‌లు స్వాధీనం

Vigilance and enforcement officials searched Telangana University : అవివీతి, అక్రమాల ఆరోపణలపై తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. యూనివర్సిటీ పరిపాలన భవనంతోపాటు అకౌంట్‌ సెక్షన్‌ కార్యాలయం, ఖజానా విభాగం, ఆర్ట్స్ కాలేజీ భవనంలో సుమారు తొమ్మిది గంటలపాటు సోదాలు నిర్వహించారు. పరిపాలన భవనంలో కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకొని యూనివర్సిటీ సిబ్బందిని విచారించారు.

Telangana University
Telangana University
author img

By

Published : Jun 6, 2023, 7:06 PM IST

Updated : Jun 6, 2023, 10:53 PM IST

TU Controversy Latest Issue : తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మూడు కార్లలో సుమారు పది మంది అధికారులు యూనివర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీ పరిపాలన భవనంతో పాటు అకౌంట్‌ సెక్షన్‌ కార్యాలయం, ఖజానా విభాగం, ఆర్ట్స్ కాలేజ్ భవనంలో సుమారు తొమ్మిది గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. పరిపాలన భవనంలో కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం సిబ్బందిని విచారించారు.

అనంతరం పరిపాలన భవనంలో ఉన్న ఎస్​బీఐ బ్యాంకులో వర్సిటీకి జీతాల చెల్లింపుపై వివరాలను సేకరించారు. వర్సిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీ విషయం తెలుసుకొని న వీసీ రవేందర్ గుప్తా తన పీఏతో పలు దస్త్రాలను పరిపాలన భవనం నుంచి తెప్పించుకొన్నారు. అనంతరం కారులో హైదరబాద్​ వెళ్తున్న ఆయనను కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్​ప్లాజా వద్ద అధికారులు అడ్డగించి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

యూనివర్సిటీకి చెందిన పలు ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆ యూనివర్సిటీ రిజిస్టర్ కనకయ్యను తొలగించడం.. మరో రిజిస్టర్​ను నియమించడంతో యూనివర్సిటీలో గందర గోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. విద్యార్థులు నిరసనలు తెలిపారు. పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో బైఠాయించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​ లింబాద్రిలకు ఫిర్యాదు చేశారు.

దీంతో ప్రభుత్వం టీయూలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏక కాలంలో దాడులు కొనసాగించడం యూనివర్సిటీ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇది ఇలా ఉండగా.. దాడులు జరిగే కొద్ది క్షణాల్లోనే వీసీ, రిజిస్ట్రార్ పరిపాలన భవనం నుంచి వెళ్లిపోవడం సర్వత్ర ఆసక్తిగా మారింది.

Telangana University VC controversy : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ఉన్న ఈ యూనివర్సిటీ చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి. రిజిస్ట్రార్‌ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో వర్సిటీ పరువు మరింత దిగజారుతోంది. వీసీగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు తీసుకుని నిండా రెండేళ్లు కూడా పూర్తి కాకముందే.. ఇప్పటికే తొమ్మిది సార్లు రిజిస్ట్రార్‌లు మారారు. రిజిస్ట్రార్‌ మొదలు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల వరకూ ప్రతి అంశం వివాదాస్పదమవుతోంది.

రిజిస్ట్రార్‌ను టీయూ పాలక వర్గం నియమిస్తే.. వైస్‌ ఛాన్స్‌లర్‌ అడ్డుపడటం.. వీసీ నియమిస్తే ఈసీ ఆమోదం లభించకపోవడం వంటి ఘటనలతో యూనివర్సిటీలో గత కొన్ని నెలలుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పరిపాలన భవనంలోని వీసీ ఛాంబర్‌లో పీడీఎస్‌యూ, బీవీఎం, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన గళం వినిపించారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సమస్యల వలయంలో యూనివర్సిటీ: తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో రెండు పీజీ కోర్సులతో ప్రారంభమై ప్రస్తుతం 30 కోర్సులతో 2 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇందుకు క్యాంపస్​లో మూడు హాస్టల్​ను నిర్మించారు. ఇందులో అబ్బాయిలకు రెండు కేటాయించగా.. అమ్మాయిలకు ఒక్కటే హాస్టల్ అందుబాటులో ఉంది. 350 మంది విద్యార్థినిలు ఉండే వసతి గృహంలో ప్రస్తుతం 600 మంది విద్యార్థుల వరకు వసతి పొందుతున్నారు. యూనివర్సిటీలో అన్ని వసతులు ఉంటాయని అనుకొని వస్తున్న విద్యార్థులకు సమస్యలే దర్శనం ఇస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.