పదేళ్ల తర్వాత ఓ ప్రభుత్వ పాఠశాలను అధికారులు బడి బాట కార్యక్రమలో ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలను 2009లో మూసేశారు. మళ్లీ ఆ స్కూల్‌ను తెరిపించాలని గ్రామస్థులు నిర్ణయించారు. స్వచ్ఛందంగా విరాళాలు వసూలు చేసి బడి రూపురేఖలు మార్చారు. గ్రామంలోని విద్యార్థులను సర్కార్ బడికే పంపాలని యువజన సంఘం సభ్యులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గ్రామంలో 30 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపుతామని తల్లిదండ్రులు చెప్పగా... విద్యాశాఖ అధికారులు సంతోషంగా ముందుకు వచ్చి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించారు.
ఇవీ చూడండి: అప్పు కట్టలేదని మహిళపై 10 మంది దాడి