నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద వలసకూలీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ప్రశాంత్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని నేతలు కార్మికులతో పాటు వలస కార్మికులకు నాయకులు అన్నదాన కార్యక్రమం, తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వరకు వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. లాక్డౌన్ ముగిసేంత వరకు వాహన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నాయకులు తెలిపారు.