ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీకా పంపిణీ ప్రశాంతం - Corona vaccine distribution news

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ టీకా పంపిణీ ప్రశాంతంగా సాగింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజాప్రతినిధులు పాల్గొని టీకా పంపిణీ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాక్సిన్ పంపిణీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికుడు మొదటి టీకా తీసుకోగా.. కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు తొలి వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీకా పంపిణీ ప్రశాంతం

author img

By

Published : Jan 16, 2021, 10:24 PM IST

నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రశాంతంగా సాగింది. జిల్లాకు 302 కొవిషీల్డ్ వాయిల్స్ వచ్చాయి. జిల్లాలో మొదటి దశ కింద మొత్తం 23 వేల మందికి టీకా ఇవ్వనున్నారు. తొలి రోజు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం మొదటిరోజు 180 మందికి వ్యాక్సిన్ వేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించి... ప్రక్రియను పరిశీలించారు. వ్యాక్సిన్ అనంతరం లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

పారిశుద్ధ్య కార్మికుడికి...

మొదటి టీకాను జిల్లా ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే అజయ్ వేయించుకున్నారు. టీకా పంపిణీలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా పాల్గొన్నారు. టీకా పూర్తి సురక్షితమని.. ధైర్యంగా ముందుకొచ్చి టీకాలు వేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.

కామారెడ్డిలో...

కామారెడ్డి జిల్లాలో నాలుగు కేంద్రాల పరిధిలో టీకా పంపిణీ చేశారు. కొవిషీల్డ్ కంపెనీకి చెందిన 80 వాయిల్స్ టీకా జిల్లాకు వచ్చాయి. 4 కేంద్రాల పరిధిలో తొలిరోజు 175 మందికి టీకా పంపిణీ చేశారు. తొలి టీకాను సదాశివనగర్ పీహెచ్​సీ వైద్యుడు నాగరాజు వేయించుకున్నారు. కామారెడ్డి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ అజయ్ కుమార్, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్​ టీకా వేయించుకున్నారు.

కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సదాశివనగర్ లో ఎమ్మెల్యే సురేందర్​లు పాల్గొన్నారు. తొలి రోజు టీకా పంపిణీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగియగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చదవండి :

కిష్టమ్మ చెప్పిన తొలి టీకా ముచ్చట!

'వ్యాక్సినేషన్ విజయవంతం... సీఎం కృషి అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.