ETV Bharat / state

కరోనా సహాయక కేంద్రాలుగా సీపీఎం కార్యాలయాలు

నిజామాబాద్​ జిల్లాలో కొవిడ్​ కేసులు పెరుగుదల దృష్ట్యా కరోనా సహాయక కేంద్రాలుగా సీపీఎం కార్యాలయాలను వినియోగించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు తెలిపారు. కరోనా సోకిన వారు తమ కార్యాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

cpm news, cpm offices as isolation centers, nizamabad

author img

By

Published : May 7, 2021, 5:14 PM IST

కరోనా సహాయక కేంద్రాలుగా సీపీఎం కార్యాలయాలను వినియోగించనున్నట్లు ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్​ బాబు తెలిపారు. పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు.

జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతున్న సందర్భంలో అనేకమంది నిరుపేదలు, అద్దె ఇళ్లల్లో ఉండేవారు.. కరోనా సోకి కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్నారని రమేశ్​ బాబు అన్నారు. వారికి తమ పార్టీ తరఫున అండగా ఉండాలని.. అటువంటి వారిని ఆదుకోవడానికి సహాయక కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

ఐసోలేషన్ కేంద్రాలుగా...

కొవిడ్​తో ఇబ్బంది పడేవారు తమ కార్యాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా అధికారులను కలిసి తమ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగించడానికి కావలసిన మెడికల్ కిట్స్​, పడకలు, ఏఎన్ఎం లను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

అడిగిన వారందరికీ టెస్టులు, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రజలు తమ హెల్ప్​లైన్​ నంబర్​ 9949136833 ను సంప్రదించి కావలసిన సహాయం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు పెద్ద వెంకట్రాములు, ప్రజా సంఘాల బాధ్యులు శిల్ప లింగం, నూర్జహాన్, గోవర్దన్, సూరి, మహేశ్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కేసీఆర్​కు ప్రజల ఆరోగ్యం కంటే డబ్బులే ముఖ్యం: వీహెచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.