ETV Bharat / state

'బ్రాహ్మణ కార్పొరేషన్​ను ఉపయోగించుకోవాలి'

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్​రావు, సినీ నటుడు సుమన్​లు ప్రారంభించారు.

author img

By

Published : Nov 20, 2019, 3:05 PM IST

'బ్రాహ్మణ కార్పొరేషన్​ను ఉపయోగించుకోవాలి'

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్​రావు, సినీ నటుడు సుమన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బ్రహ్మణ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ప్రతి బ్రాహ్మణుడు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ కేవీ రమణాచార్యులు అన్నారు. అర్హులైన బ్రాహ్మణులు వ్యాపారం చేసుకునేందుకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.

రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 800 మంది వివిధ వ్యాపారులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మరో 200 మందికి త్వరలో లబ్ధి చేకూరనుందని అన్నారు. పేద బ్రాహ్మణుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు కూడా కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ కేంద్రమంత్రి ఎస్. వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

'బ్రాహ్మణ కార్పొరేషన్​ను ఉపయోగించుకోవాలి'

ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెపై 4గంటలకు కీలక ప్రకటన?

Intro:tg_nzb_12_19_avagahana_sadhassu_avb_ts10108
( ). నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి లోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపం లో బ్రాహ్మణ కార్పొరేషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు, సినీ నటుడు సుమన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కె.వి రమణాచార్యులు మాట్లాడుతూ.. బ్రాహ్మణ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ప్రతి బ్రాహ్మణుడు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందాలని అన్నారు. అర్హులైన బ్రాహ్మణులు వ్యాపారం చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు 800 మంది వివిధ వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మరో 200 మందికి త్వరలో లబ్ధి చేకూరనుంది అన్నారు. పేద బ్రహ్మణుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు కూడా కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల నుండి బ్రాహ్మణ కార్పొరేషన్ కు 3000 దరఖాస్తులు వచ్చాయని, కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి కార్పొరేషన్ పట్ల బ్రాహ్మణులకు అవగాహన లేకపోవడంతో కేవలం 22 దరఖాస్తులు మాత్రమే అందాయని అన్నారు. పతి బ్రాహ్మణుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫలాలను పొందాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ కేంద్రమంత్రి ఎస్. వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
byte. కె.వి.రమణాచారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్.

Body:శ్రీకాంత్ నిజామాబాద్ గ్రామీణం

Conclusion:8688223746

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.