ETV Bharat / state

మీ ఆదాయం సరే.. మా వైద్యం సంగతేంటి..? - DOCTORS NEGLIGENCE

అదీ జిల్లా స్థాయి సర్కారీ వైద్యశాల...అక్కడ సకల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.  కాని చికిత్స అందించకుండా అప్పుడే పుట్టిన పిల్లల జీవితాలతో వైద్యులు చెలగాటమాడుతున్నారు. వెరసి వారి తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రి బాట పడుతుండటం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతోంది.

చిన్న పిల్లల పట్ల అధిక శ్రద్ధ వహించాలి : రోగులు
author img

By

Published : May 6, 2019, 5:41 AM IST

ప్రైవేట్ ఆసుపత్రి బాట పట్టడం వల్ల తడిసి మోపెడవుతున్న ఖర్చు
సర్కారీ దవాఖానాలు ఇప్పడిప్పుడే బాగు పడుతున్నారు వైద్యుల పనితీరు మెరుగ్గా ఉండటం లేదు. పేదల ఆస్పత్రిగా పేరున్నా పసి పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పెద్ద సంఖ్యలో వైద్యులున్నా చిన్నారులకు సరైన వైద్యం కరువైంది. సొంత ఆసుపత్రుల ఆదాయం కోసం సర్కారీ దవాఖానాల్లో విధులను గాలికి వదిలేస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తున్నా.. రోగుల పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం లేదు. అప్పుల పాలవుతున్న రోగులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా 17 మంది పసి పిల్లల వైద్య నిపుణులు ఉన్నా చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదు. ప్రధానంగా అప్పుడే పుట్టిన పిల్లల పట్ల వైద్యులు వ్యవహరిస్తోన్న తీరు సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. పేదలు అప్పు చేసైనా ప్రైవేటును ఆశ్రయించాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రి గడప తొక్కాల్సిన పరిస్థితి. దీని వల్ల అప్పుల పాలవడం తప్ప ప్రయోజనం లేదని పేదలు వాపోతున్నారు.సమయపాలన పాటించని ప్రభుత్వ వైద్యులు అప్పుడే పుట్టిన పిల్లలకు 21 రోజుల వరకు ఎలాంటి సమస్య వచ్చినా ఎన్ఎన్​సీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇద్దరు లేదా ముగ్గురు చిన్నారులను ఎన్ఎన్​సీయులో చేర్చుకుంటారు. నిత్యం 80-90 మంది పిల్లలు ఓపీకి వస్తుండగా 15 నుంచి 20 మంది చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఐపీగా 5 నుంచి పది మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎంబీబీఎస్ విద్యార్థులకు బోధిస్తారు. మిగతా రెండు యూనిట్ల వారు వార్డులోని ఉన్న రోగులకు చికిత్స అందిస్తారు. వైద్యులు సమయానికి రాకపోవడం, పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, ప్రైవేటు ప్రాక్టీస్ కారణంగా ప్రభుత్వ వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యం కొంచెం...వైద్యుల సంఖ్య ఘనం మొత్తం 17 మంది పిల్లల వైద్యుల్లో ముగ్గురు ఎన్ఎన్​సీయూకి పరిమితం కాగా మిగతా వారు ఓపీ విభాగంలో ఉంటారు. ఒక యూనిట్​లో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. ఇలా మూడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సభ్యులు ఒక్కో రోజు ఓపీ చూడటం, ఐపీ చేర్పించడం, వార్డుల్లో పర్యవేక్షణ వంటివి చేస్తారు. ఇన్ని సౌకర్యాలు, ఇంత మంది సిబ్బంది ఉన్నా...చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు ప్రైవేటుకు పరుగులు తీయక తప్పని పరిస్థితి ఎదురవుతుందంటే వైద్యులు ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తీరు మారాలే డాక్టరు సారూ...చిన్న పిల్లల పట్ల అధిక శ్రద్ధ వహించి ప్రైవేటు ఆసుపత్రి తిప్పలు తప్పించాలని లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్యులు తమ తీరు మార్చుకుని వైద్యం అందించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. ఇవీ చూడండి : ఇందూరు పెద్దాసుపత్రిలో క'న్నీటి' కష్టాలు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.