రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని... నిజామాబాద్‌లోని తెలంగాణ ప్రత్యేక పోలీసు 7వ పటాలం కమాండెంట్ సత్య శ్రీనివాస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా... పటాలం నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు, బెటాలియన్ సిబ్బంది, టోల్ ప్లాజాల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లోని ప్రజలు హైవే ఎక్కేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు టోల్ ప్లాజా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు, టోల్ ప్లాజా టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు. దానివల్ల సిబ్బంది సకాలంలో చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: 'రైతు ప్రయోజనాల దృష్ట్యా మరిన్ని నాణ్యమైన సేవలు'