పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు సంఘాల నేతలు కోరారు. లేదంటే వచ్చే నెల 4నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి వినతిపత్రాలు ఇస్తామని వెల్లడించారు. పసుపు బోర్డు దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే గ్రామస్థాయి నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: గుజరాత్‌లోనూ ఉగ్రకలకలం... భద్రత కట్టుదిట్టం