ETV Bharat / bharat

అయ్యప్ప భక్తులకు డబుల్ గుడ్​న్యూస్- డౌట్స్​ క్లియర్​ చేసే AI యాప్- శబరిమలలో ఫుడ్ ఐటెమ్స్​ ధరలు ఫిక్స్! - SWAMI CHATBOT SABARIMALA PILGRIMAGE

అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్- 'స్వామి' ఏఐ చాట్​బాట్​తో మీ డౌట్స్ అన్నీ క్లీయర్​- ఒక్క క్లిక్​తో యాత్ర సమాచారమంతా మీ చేతుల్లోనే!- శబరిమలలో ఫుడ్​ ఐటెమ్స్​ ధరలు ఫిక్స్!

Swami Chatbot Sabarimala Pilgrimage
Swami Chatbot Sabarimala Pilgrimage (ETV Bharat, Pathanamthitta District Administration)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 1:41 PM IST

Swami Chatbot Sabarimala Pilgrimage : శబరిమల దర్శన అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కేరళలోని పతనంతిట్ట జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముతూట్​ గ్రూప్​తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ "స్వామి" ఏఐ చాట్​బాట్​ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు రియల్​ టైమ్​ సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు, భద్రత అందించడమే లక్ష్యంగా ఈ చాట్​బాట్​ను అభివృద్ధి చేశారు.

అన్ని వర్గాల భక్తులు సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుగా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​తో ఈ యాప్​ను సిద్ధం చేశారు. ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని- భక్తులు ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చాట్​బాట్​ అందిస్తుంది. అంతేకాకుండా తమ దగ్గర్లో ఉన్న దేవాలయాలు, ఎయిర్​పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్​స్టాప్​ల వివరాలను భక్తులకు అందిస్తుంది.

'స్పెషల్ సేఫ్టీ టూల్'
మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు, ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగపడే ఓ సేఫ్టీ టూల్​ను ఈ యాప్​లో పొందుపర్చారు. దాని ద్వారా పోలీస్, అగ్నిమాపక, మెడికల్ అసిస్టెన్స్​, ఫారెస్ట్​ అధికారులు, ఫుడ్​ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందిచేందుకు వీలవుతుంది. ఫలితంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ "స్వామి" చాట్​బాట్ ద్వారా ఆధ్యాత్మికతకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా తీర్థయాత్రల అనుభవాన్ని మెరుగపరడంచలో ఓ కీలక ముందడుగు పడినట్లైంది.

ఫుడ్​ ఐటెమ్స్​ ధరలివే!
శబరిమల తీర్థయాత్ర సీజన్​లో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ధరల జాబితాను ప్రదర్శించాలని పతనంతిట్ట కలెక్టర ఎస్​ ప్రేమకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 2025 జనవరి 25 వరకు కచ్చితంగా ధరల లిస్ట్​ ప్రదర్శించాలని తెలిపారు. అయ్యప్ప దేవాలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలో భక్తులు తినుబండారాల ధరల విషయంలో సమస్య ఎందుర్కొంటారు. యాత్ర సమయంలో అనేక ఫిర్యాదులలు వస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది అధికారులు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.

ఐటెమ్క్వాంటిటీగరిష్ఠ ధరసన్నిధానంపంబా/నిలక్కల్
టీ150mlరూ.14 రూ.12 రూ.11
కాఫీ150ml రూ.13 రూ.12రూ.11
డార్క్ కాఫీ/డార్క్​ టీ 150ml రూ.11రూ.10రూ.9
టీ/కాఫీ150mlరూ.12రూ.11రూ.10
ఇన్​స్టంట్ కాఫీ(మెషీన్ కాఫీ)150mlరూ.21రూ.18రూ.18
ఇన్​స్టంట్ కాఫీ(మెషీన్ కాఫీ) 200mlరూ.24రూ.22రూ.22
బాన్​విటా/హార్లిక్స్​150ml రూ.27రూ.25రూ.26
దాల్​ వడ 40గ్రారూ.16రూ.14రూ.11
బోండా75గ్రారూ.15రూ.13రూ.10
బజ్జి 30గ్రా రూ.13రూ.12రూ.10
దోష(ఒకటి) చట్నీ, సాంబార్​తో50గ్రా రూ.14రూ.13రూ.12
ఇడ్లీ(ఒకటి) చట్నీ, సాంబార్​తో50గ్రా రూ.15రూ.14రూ.12
చపాతి(ఒకటి) 40గ్రారూ.15రూ.14రూ.11
పూరి(ఒకటి) మసాలాతో కలిపి40గ్రారూ.16రూ.14రూ.12
పరోటా(ఒకటి) 50గ్రారూ.16రూ.14రూ.11
పలప్పం50గ్రారూ.14రూ.13రూ.10
ఇడియప్పం50గ్రారూ.14రూ.13రూ.10

పతనంతిట్ట కలెక్టర్​ జారీ చేసిన మిగతా మార్గదర్శకాలు ఇవే

  • పతనంతిట్టా జిల్లా నలుమూలను నుంచి శబరిమలకు దారి తీసే అన్ని రహదారుల వెంబడి వంటలు చేయడం నిషేదం. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో వంటలు చేయకూడదు.
  • లాహ నుంచి సన్నిధానం వరకు ఉండే రెస్టారెంట్లలో ఒకేసారి 5 సిలిండర్లు మాత్రమే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరంగా సిలిండర్లు నిల్వ​ చేయడం నిషేధం.
  • పంపా నుంచి సన్నిధానం వెళ్లే దారిలో అనుమతి లేని దుకాణాలు నిషేధం. యాత్ర దారుల్లో పశువులు మేపడం నిషిద్ధం. ఈ మార్గదర్శకాలు జనవరి 25 వరకు అమలులో ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.