ETV Bharat / technology

BMW కొత్త కారు భలే ఉందిగా.. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే డిజైన్, మైలేజీలోనూ సూపరంతే..!

మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కారు- 'BMW M340i' మోడల్ అదిరిందిగా!- ధర ఎంతో తెలుసా?

2024 BMW M340i Launched
2024 BMW M340i Launched (BMW India)
author img

By ETV Bharat Tech Team

Published : 3 hours ago

2024 BMW M340i Launched: వాహన ప్రియులకు గుడ్​న్యూస్. మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కారు వచ్చింది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇండియా తన అప్డేటెడ్ BMW M340i పెర్ఫార్మెన్స్ సెడాన్​ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ప్రీవియస్ మోడల్​ కారు లోపల, బయట కొన్ని మార్పులు చేసి ఆకర్షణీయమైన డిజైన్​లో దీన్ని రూపొందించారు.

ఇందులో కొన్ని స్టాండర్డ్​ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అందులో న్యూ పెయింట్ స్కీమ్స్​ కావాలంటే రూ. 5.7 లక్షల కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. LCI అప్‌డేట్ తీసుకొచ్చిన ఈ ఛేంజెస్ 2 సంవత్సరాల క్రితం కంపెనీ తీసుకొచ్చిన కారు మాదిరిగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన కారు చుట్టూ సటిల్ బ్లాక్ ట్రీట్​మెంట్ ఉంటుంది. అంతేకాక హెడ్​ల్యాంప్స్​లో M లైట్ షాడోలైన్ ఫినిష్ ఉంటుంది. వీటితో పాటు కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో 19-అంగుళాల జెట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ (995M)తో ఈ కారు వస్తుంది.

దీని పాత మోడల్​లో ఉండే షార్పర్ బంపర్ డిజైన్, బ్లాక్ మెష్ కిడ్నీ గ్రిల్, డ్యూయల్-ఎగ్జాస్ట్ టిప్స్, బ్లాక్-అవుట్ ORVMలు వంటి అగ్రెస్సివ్ పార్ట్స్ BMW M340iలో అలానే ఉంచారు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే దీని వెర్నాస్కా లెదర్ అప్హోల్స్టరీని ఛేంజ్ చేశారు. ఇది పూర్తిగా బ్లాక్ కలర్​లో ఉంది. కాంట్రాస్ట్ M హైలైట్‌లను కలిగి ఉంది.

ఈ కారులో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది మొట్టమొదటిసారిగా BMW M340iతో తీసుకొచ్చారు. అంతేకాక ఈసారి సరికొత్త OS8.5 ఆపరేటింగ్ ఇంటర్‌ఫేస్‌తో దీన్ని అప్​డేట్​ చేశారు. ఇందులో మరో చిన్న మార్పు ఏంటంటే.. స్టీరింగ్ వీల్‌పై రెడ్ సెంటర్ మార్కర్ ఉంటుంది. సాధారణంగా ఇది BMW M కార్లలో కనిపిస్తుంది. ఈ కారు అప్‌డేట్‌లో భాగంగా M హై గ్లోస్ షాడోలైన్, ఇండివిడ్యువల్ హెడ్‌లైనర్ ఆంత్రాసైట్, ఇంటీరియర్ ట్రిమ్‌ను కార్బన్ ఫైబర్‌ ఫినిష్​తో తీసుకొచ్చారు.

కారు ఇతర ఫీచర్లు గురించి చెప్పాలంటే వెల్‌కమ్ లైట్ కార్పెట్, ఆరు డిమ్మబుల్ లైట్లతో కూడిన యాంబియంట్ లైటింగ్, థ్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెనుకవైపు 40:20:40 స్ప్లిట్ సీట్లు ఉన్నాయి. కావాలంటే కస్టమర్లు M పెర్ఫార్మెన్స్ యాక్ససరీస్​ను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో స్పాయిలర్‌పై కార్బన్ ఫైబర్ ఫినిషర్, మెష్ కిడ్నీ గ్రిల్, M-బ్యాడ్జ్డ్ డోర్ పిన్స్, ఆల్కాంటారా ఆర్మ్‌రెస్ట్​తో పాటు అదనపు ప్రత్యేకత కోసం 50 జహ్రే M గుర్తు ఉన్నాయి.

BMW M340i పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఇది 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ స్ట్రెయిట్-సిక్స్ కలిగి ఉంది. ఇది సుమారు 374bhp పవర్, 500Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్​తో xDrive ఛానెల్ ద్వారా పవర్​ను నాలుగు చక్రాలకు పంపిస్తుంది. ఈ కారు కేవలం 4.4 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.

ధర: కంపెనీ ఈ కారును రూ. 72.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది.

సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా- భారత్ NCAP టెస్ట్​లో మహీంద్రా 'రాక్స్'

దేశంలోనే చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్​ తీసుకొచ్చిన జియో!- రూ.11కే 10GB హై స్పీడ్ డేటా- కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.