నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 40వ రోజూ కొనసాగుతోంది. నగరంలోని ధర్నా చౌక్‌లో ఆర్టీసీ ఉద్యోగులు సామూహిక దీక్షలు చేశారు. వీరికి సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు సంఘీభావం ప్రకటిస్తూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతానికి పోకుండా కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని... తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండిః కలికాలమంటే ఇదేనేమో.. నదీ ఒడ్డునే ఇసుక విక్రయం