నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఉపఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందికి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పలు సూచనలు, ఆదేశాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవడానికి 48 గంటల ముందు వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన వివరించారు. కొవిడ్ నిబంధల మేరకు 65 సంవత్సరాలకు పైబడిన వారు, కొవిడ్ పాజిటివ్ పేషెంట్లు, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నాారు.
పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకునే వారు తమ వెంట ఓటర్ ఐడీ కార్డు, ఓటర్ లిస్టులో పేరు, సీరియల్ నంబర్ తదితర వివరాలతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. మంగళవారం నుంచి సంబంధిత ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు.
ఇదీ చూడండి: 'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'