నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సీటీపీసీ కానిస్టేబుల్ల శిక్షణ ముగింపు వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ హాజరయ్యారు.
ఈ కేంద్రంలో మొత్తం 258 మంది శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారిని సైబరాబాద్ కమిషనరేట్లో రిపోర్ట్ చేస్తారని శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ తెలిపారు. అక్కడ వారికి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు అప్పగిస్తారని స్పష్టం చేశారు.